26-07-2025 12:51:22 AM
కొత్తపల్లి, జూలై 25(విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శ్రావణమాస ఆరంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై సరస్వతి మాత విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూజ కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ శ్రావణమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసమని, మాసంలో అనేక రకాలైన పూజలు నిర్వహిస్తారని ముఖ్యంగా మహిళలు సౌభాగ్యం కోసం అనేక వ్రతాలు ఆచరిస్తారని తెలిపారు.విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.