27-07-2025 08:33:24 AM
30 మందికి పైగా విద్యార్థినిలను ఆసుపత్రికి తరలింపు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి సుమారు 30 మందికి పైగా విద్యార్థులు కడుపునొప్పి వాంతులు విరేచనాలతో బాధపడుతూ కుప్పకూలారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. రోజులాగే శనివారం సాయంత్రం స్నాక్స్ పకోడీ తిన్న అనంతరం విద్యార్థులకు కడుపునొప్పి తీవ్ర ఆయాసంతో బాధపడుతూ ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది వెంటనే అంబులెన్స్ ఇతర ప్రైవేటు కార్లు ఇటువంటి వాహనాల్లో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరి కొంతమంది విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.