27-07-2025 01:39:19 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): తెలంగాణలో 2023 డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు (20 నెలల కాలం) 10 లక్షల 70 వేల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందా యి. ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులు మెరుగైన చికిత్సను పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచింది.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కృషితో సుమారు దశాబ్దకాలం తర్వాత ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను ప్రభుత్వం సవరించింది. సగటున 22 శాతం మేర పెరిగిన చార్జీలు.. ప్రతినెలా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి.
దీం తో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులు ఆసక్తి చూపిస్తున్నాయని, ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న ప్రైవేట్, కార్పోరేట్ అసుపత్రుల యజమాన్యాలకు మంత్రి రాజనరసింహ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ. 1,590 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు.
దీంతో ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ కోసం పోటీ పెరిగినట్లు మంత్రి రాజనరసింహ వివరించారు. కొత్తగా ఆరోగ్యశ్రీలో వందకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ చేరాయని, మొత్తంగా 461 ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ సేవలు అందు బాటులో ఉన్నట్లు మంత్రి చెప్పారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం ఆరోగ్య శ్రీ పథకం తీసుకొచ్చిన విష యం తెలిసిందే.