calender_icon.png 27 July, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు

27-07-2025 11:37:12 AM

హైదరాబాద్: నగరంలో రేవ్ పార్టీ మరోసారి కలకలం రేపింది. కొండాపూర్ లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం మదాపూర్ లో సైబర్ టవర్స్ దగ్గర సర్వీస్ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. బర్త్ డే పార్టీని నిర్వహిస్తున్న నాగరాజ్ యాదవ్ తో పాటు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. 11 మందిపై కేసు నమోదు చేసి వారి నుంచి 6 కార్లు, డ్రగ్స్, విదేశీ మద్యం, 2 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్, 11.57 గ్రాముల మ్యూజిక్ మష్రుమ్, 1.91 గ్రాముల చెరాస్ డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన వాసు, శివం రాయుడు ఇతరుల గుర్తింపు కార్డులు వాడి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసి శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.