calender_icon.png 27 July, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు సిట్ విచారణకు హాజరుకాలేను: బండి సంజయ్

27-07-2025 10:58:06 AM

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూలై 28న వాంగ్మూలం ఇవ్వడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(SITE) ముందు హాజరుకాలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. రేపు పార్లమెంటులో జరుగనున్న శీతాకాల సమవేశాల్లో భాగంగా ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతుంది. దీంతో సిట్ విచారణకు రాలేనని, త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. 

జూలై 21 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన మధ్యాహ్నాం 12 గంటలకు సిట్ విచారణకు హాజరై తనతో పాటు తన ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పసునూరు మధు, వ్యక్తిగత సహాయకులు బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి వాంగ్మూలాలు ఇస్తారని బండి సంజయ్ కేసు దర్యాప్తు అధికారి జూబ్లీ హిల్స్‌కు చెందిన ఏసీపీ వెంకట గిరిజీకి రాసిన లేఖ పేర్కొన్నారు. అయితే 28న ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగనుంది. దీంతో తాను ఢిల్లీలోనే ఉండాల్సివచ్చిందని మంత్రి బండి సంజయ్ తెలిపారు.