calender_icon.png 27 July, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

27-07-2025 11:11:59 AM

హైదరాబాద్: గత నాలుగు,ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వరద నీరు వస్తున్నందున నాగార్జున సాగర్ జలాశయంలోకి నీటి ప్రవాహం పెరిగింది. నాగార్జున సాగర్ జలాశయానికి  ఇన్ ఫ్లో 92,976 క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 35,343 క్యూసెక్కుల నీరు ప్రవేశించింది. ప్రాజెక్టు కుడి, ఎడమవైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం 582.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 312.04 టీఎంసీల నిల్వ సామర్థ్యంలో, 289.36 టీఎంసుల నీరు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.