27-07-2025 08:39:17 AM
అధికారం లేకపోత విలవిల లాడే పార్టీ కాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
అశ్వారావుపేట,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ సమ సమాజ స్టాపనే ద్యేయంగా పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు. అశ్వారావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కళ్యాణ వేదికలో భద్రాది కొత్తగూడెం జిల్లా సీపీఐ 3వ మహా సభకు ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ కి అధికారం తో పని లేదని, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ అని అన్నారు.
సిద్ధాంతమే తమ అధికారమని, మనిషిపై ప్రేమ కూడా తమకు అధికారమని అన్నారు. నిజమైన కమ్యూనిస్టు కు ఈర్ష, ద్వేషం ఉండదని అన్నారు. డిసెంబర్ 26 నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ కి వంద ఏళ్లు పూర్తి అవుతాయని, దానిని పురస్కరించుకొని ఖమ్మంలో లక్షలాది మంది కార్యకర్తలతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ధైర్యంగా ఉండాలంటే ఒక్క కమ్యూనిస్ట్ లకు మాత్రమే సాధ్యమన్నారు. కమ్యూనిస్టు జెండా లేని దేశం లేదన్నారు. సమాజం లో జరుగుతున్న మార్పుల్లో కమ్యూనిస్టు పార్టీ ఉందన్నారు. జిల్లా మహాసభ లో గత మూడు సంవత్సరాల కాలం లో చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు, రాబోయే కాలం లో చేపట్టే కార్యక్రమాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం అన్నారు.