27-07-2025 10:26:52 AM
హైదరాబాద్: అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణె మధ్య జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏసీ బోగీలోని కింది భాగంలో పోగలు రావడం గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును నందలూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. బోగిలోని ప్రయాణికులను కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైలు చక్రాల సమీపంలో బ్రేకుల వద్ద పోగలు వస్తున్నాయని గుర్తించిన సిబ్బంది రైలుకు మరమ్మతులు నిర్వహించారు. అనంతరం రైలు బయలుదేరింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి మరణం సంభవించలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.