18 August, 2026 | 1:15 AM

సీఐ నిరంజన్ రెడ్డికి ఘన సత్కారం

18-08-2026 12:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా 4వ డివిజన్ నాయ కులు, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.