7 June, 2026 | 1:57 AM

94.32 శాతం ఉత్తీర్ణత

07-06-2026 12:11 AM
  1. పీఈసెట్ ఫలితాలు విడుదల
  2. బీపీఈడీలో 1,689, డీపీఈడీలో 2,310 మంది పాస్

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఫలితాలను విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేష్‌కుమార్‌తో కలిసి విడుదల చేశారు. బీపీఈడీ కోర్సుకు 1,795 మంది టెస్టుకు హాజరుకాగా, అందులో 1,689 మంది ఉత్తీర్ణత సాధించారు. డీపీఈడీ కోర్సులో 654 మందికి గాను 621 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 2,449 మందికిగానూ 2,310 (94.32 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.