01-01-2026 02:52:38 PM
తంగళ్ళపల్లి,(విజయకాంత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో అంకుసాపూర్ గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ జగ్గని రాజేశంలను శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు సర్పంచ్ సేవలను ప్రశంసిస్తూ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంచ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సౌడలమ్మ దేవాలయ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అలాగే శ్రీకృష్ణ యాదవ సంఘానికి సంబంధించిన నిధుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైన సహాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, దేవాలయాల సంరక్షణ, సంఘాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు జగ్గని రాజేశం, మాజీ అధ్యక్షుడు కొమురయ్య, జీల కొమురయ్య ముత్తయ్య, బోటుకుఎల్లం, పరశురాములు, మరియు సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.