calender_icon.png 1 January, 2026 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సంవత్సర శుభాకాంక్షలు

01-01-2026 03:00:44 PM

రామచంద్రపురం, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ డివిజన్ అభివృద్ధికి మరింత శక్తిని ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు.

అలాగే ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న సోమ్మన్న జాతర ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఆలయం వద్ద భక్తులకు అడ్డుగా ఉన్న స్తంభాన్ని రెండు రోజుల్లో తన సొంత నిధులతో తొలగించి, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ, యాదవ సంఘం అధ్యక్షులు రాగం రమేష్ యాదవ్‌తో పాటు బైకన్ సాయిలు యాదవ్, రాములమ్మ, రాగం కృష్ణ యాదవ్, ఈశ్వర్ పంతులు, బైకన్ సోమేష్ యాదవ్, ప్రభు యాదవ్, వనం చిన్న యాదవ్, లక్ష్మీనారాయణ, వీరేష్ యాదవ్, సోమయ్య యాదవ్, కృష్ణ యాదవ్, బల్ల నర్సింగ్ రావు, ధనసిరి ప్రకాష్, చాకలి నర్సింహ, కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.