01-01-2026 02:54:21 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని, అమీర్‌పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి నేడు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, ఆయనకు ఆయురారోగ్యాలు, రాజకీయ జీవితంలో మరింత సేవాభావంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి తీసుకురావాలని ఆమె కోరారు.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా శేషుకుమారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం ప్రజలకు ఆశాజనకంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.