01-01-2026 02:59:26 PM
గ్రామ ప్రజల ఆరోగ్య ప్రణాళికకు ప్రత్యేక చర్యలు..
సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్
యరగండ్లపల్లిలో సర్పంచ్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
మర్రిగూడ,(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి తోపాటు ఆరోగ్యవంతమైన సమాజమే తన లక్ష్యమని సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో మాల్ లైఫ్ స్టార్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ విడతల వారీగా గ్రామ ప్రజల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పుట్టిన ఊరుకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గ్రామస్తుల సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా పాలకవర్గ సహకారంతో ముందుకు వెళతానని అన్నారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటారని అన్నారు. కార్యక్రమంలో లైవ్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పోలేపల్లి వినోద్ కుమార్, డాక్టర్స్ మోహిన్, లక్ష్మణ్ సిబ్బంది అశోకు, కృష్ణ ,నరేష్ ,శివ, ప్రణీత్, అనూష ,స్నేహ, స్వాతి, మమత,వార్డు సభ్యులు, యూత్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.