calender_icon.png 1 January, 2026 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపురంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

01-01-2026 02:55:57 PM

చర్చిలలో అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎంపిటిసి గింజుపల్లి రమేష్..

కోదాడ, న్యూ ఇయర్ వేవేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా యువత మస్త్‌గా ఎంజాయ్‌ చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో న్యూ హోప్, బేతస్ట్ పెంతుకోస్తు చర్చిలలో జరిగిన వేడుకలలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు గింజుపల్లి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఏసుప్రభును కోరుకున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తులో రెండు చర్చిల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రెండు చర్చిలలో అన్నదానానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.. ఈ సందర్భంగా పాస్టర్లు యేసు రాజు, ఆదాం రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.. ఈ కార్యక్రమంలో రెడ్డబోయిన ఉపేందర్, కంటూ గోపి, షేక్ సుభాని, సోమపంగు శ్రీను, గాదే సైదిబాబు, గోవింద మమేష్, పిట్టల హరీష్ పాల్గొన్నారు...