calender_icon.png 1 January, 2026 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులను గదిలో నిర్బంధించిన సోయా రైతులు

01-01-2026 03:16:57 PM

మార్కెట్ అధికారులను గదిలో నిర్భందం

బోథ్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన 

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ( Both market yard) యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. సోయా రైతులు మార్కెట్ అధికారులను గదిలో వేసి నిర్బంధించారు. వ్యవసాయ మార్కెట్ లో సోయా పంటను కొనటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ డీఎం, డీసీవో మోహన్ ను గదిలో ఉంచి రైతులు తాళం వేశారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నిర్దేశించిన నిబంధనల కారణంగా తమ ఉత్పత్తులను విక్రయించడంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నామని సోయాబీన్ రైతులు తెలిపారు. ప్రభుత్వం పరిమితులు లేకుండా సోయాబీన్‌లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు నిరసన తెలిపారు. సోయా పంటను కొనుగోలు చేయాలి డిమాండ్ చేశారు.