వైభవంగా కూచిపూడి నృత్య వేడుక
20-03-2026 12:00 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): ఉగాది సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఒక ప్రతిష్టాత్మక క్లబ్‌లో నిర్వహించిన సాంస్కృతిక వేడుకలో డా. హిమబిందు కనోజ్ నాయకత్వంలోని మువ్వా ఎన్‌ఆర్‌ఎన్ బృందం అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ప్రత్యేక ఇంటర్‌ఫెయిత్ ఉత్సవంగా నిలిచింది. ఆసఫ్ జాహీ వంశపు ప్రస్తుత కస్టోడియన్, 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్, అన్నా రావు సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.




