20 March, 2026 | 9:35 AM

ముస్లింల పవిత్ర మాసం రంజాన్

20-03-2026 12:00 AM

మంత్రి గడ్డం వివేకానంద

జైపూర్ (చెన్నూర్), మార్చి 19 : ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మం త్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జైపూర్ మండలం  ఇందారం గ్రామంలోని మసీదులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాబురావులతో కలిసి హాజర య్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జైపూర్ మండలానికి 350 మంజూ రు చేయగా ఇందారం గ్రామానికి 250 కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్యం, త్రాగునీరు, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ పైళ్ళ క్లియరెన్స్, ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులకు కార్యక్రమం అమలుపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపా ధి కల్పించే విధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి పలు రకాల వృత్తి విద్యలో శిక్షణ అందించి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం జరు గుతుందని తెలిపారు.

అనంతరం ఈద్ కా తోఫా కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులకు కానుకలు అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మసీదు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ ను ప్రారంభించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎ  జోన్ లో గల బిలాల్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.