27 August, 2026 | 2:42 AM

వరుణదేవుని కరుణ కోసం అనంతాద్రిలో మహా కుంభాభిషేకం

27-08-2026 01:27 AM

మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మహబూబాబాద్  అనంతాద్రి దేవాలయంలో శ్రీ జగన్నాథ వేంకటేశ్వర స్వామికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య (డీడీఎన్) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ అనంతాద్రి దేవాలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

జిల్లాలోని 18 మండలాలకు చెందిన డిడిఎన్ 115  అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వర్షాలు విస్తారంగా కురవాలని  స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు, మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రంగభట్టార్ , సుదర్శన ఆచార్యులు వేంకటేశ్వర ఆచార్యులు, 5 వార్డు కౌన్సిలర్ రమ్య, నవీందర్ ఆలయం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.