నా చిన్నప్పటి నుంచి ఎన్‌టీఆర్ అంటే అభిమానం
మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం, మే 28(విజయక్రాంతి): ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నందు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే రూపం నందమూరి తారక రామారావు అన్నారు. కుల వివక్షరహిత పార్టీని నిర్మాణం చేసిన ఘనత ఎన్టీఆర్ ది..
నా చిన్నప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఖమ్మం వచ్చినప్పుడు అభిమానులు బ్రహ్మరదం పట్టారని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యాన్యాయ పార్టీ స్థాపించి అందరి మన్ననులు పొందారన్నారు. ప్రాంతీయ పార్టీలు 25 సంవత్సరాల పైబడి వున్న పార్టీలు తెలుగు దేశం పార్టీ ఆ తరువాత భారత రాష్ట్ర సమితి మాత్రమే అన్నారు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంక్ బండ్ ఎక్కడలేని విదంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ చరిత్రని శిలా ఫలకాలపై లికించ్చాం వాటిని ధ్వసం చేశారు..
అంత ద్వేషం ఎందుకని ఎన్టీఆర్ అందరివాడని పార్టీలకు అతీతంగా అయనపై అందరికి గౌరవం ఉంటుందని అన్నారు. కార్యక్రమ అధ్యక్షులు వల్లభనేని రామారావు నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, కర్నాటి కృష్ణ, తాళ్లూరి జీవన్, బిక్కసాని ప్రశాంతి లక్ష్మి జస్వంత్, నాగండ్ల కోటేశ్వరరావు, బత్తుల మురళి, సామినేని హరిప్రసాద్, వీరు నాయక్, నాయకులు పాల్గొన్నారు.






