20 March, 2026 | 12:49 PM

ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

20-03-2026 12:00 AM

ఉగాది వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ

ఆదిలాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుండే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేయగా, ఆలయాల్లో షెడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. పండగ వేళ జిల్లా కేంద్రంలోని ప్రాచీన ఆలయమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

మఠంలో శ్రీ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో, మఠాధిపతి చేతుల మీదుగా జరిగిన ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా అతిథులకు ఆల య పూజారులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. మఠం ఆవరణలోని సత్యభామ రుక్మిణి సమేత శ్రీ గోపాల కృష్ణునికి, సంతోషిమాత, మహాలక్ష్మిని కలెక్టర్, ఎస్పీ దర్శించి, ప్రత్యేక పూజాలు చేశారు.

జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిం చారు. అనంతరం ఉగాది పచ్చడి, గుడాలను భక్తులకు పంపిణీ చేశారు. అదేవిదంగా నూతన పంచాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు అన్నమయ్య సంకీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ప్రజలందరికీ ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త సంవత్సరం అందరి జీవి తాల్లో కొత్త వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం లో జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సునీల్ కుమార్, ఏసీఎస్ ఛానెల్ ఎండీ ఓం ప్రకాష్‌రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు రవీందర్, కందుల రవీందర్, రాజు, నర్సోజి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.