మోదీకి ఇండోనేషియా ఘనస్వాగతం
గగనతలంలో ప్రధాని విమానానికిరక్షణగా ఎఫ్-16, సుఖోయ్-30 జెట్లు
అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానానికి చలించిపోయా : మోదీ
జకార్తా, జూలై 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా ఘనస్వాగతం పలికింది. ఆ దేశ గగనతంలోకి ప్రవేశించగానే మోదీ విమానానికి రక్షణగా దానికి ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు కదిలాయి. ఈ లాంఛనప్రాయ స్వాగతం, భారత్- దౌత్యం మరింత బలోపేతం చేయడంపై అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో చర్చలకు నాంది పలికిందని మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం పోస్టు చేశారు. ఆ తర్వాత జకార్తా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనస్వాగతం పలికారు. విమానం దిగిన తర్వాత ‘ఎక్స్’లో మోదీ మరో పోస్టు చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఈ స్వాగత కార్యక్రమానికి తాను ‘చలించిపోయానని’ పేర్కొన్నారు.
2018లో స్థాపించబడిన భారత్- సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చిందని ప్రధాని మోదీ అన్నారు. అధ్యక్షుడు ప్రబోవోతో చర్చలు అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూలై 6 నుంచి 11 వరకు జరిగే ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో తొలి విడత పర్యటిస్తారు. ప్రధాని మోదీ జూలై 8 వరకు ఇండోనేషియాలో ఉంటారు. ఇండోనేషియా నుంచి, ఆస్ట్రేలియా, ఆ తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు.






