Microsoft Layoffs 2026: Xboxలో 4,800 మందికి ఉద్యోగాల కోత.. కారణమేంటి?
‘ఎక్స్ బాక్స్’ యూనిట్‌లో 20% సిబ్బందిపై వేటు
4,800 మందికి ఉద్వాసన
Microsoft సంస్థ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా Xbox గేమింగ్ విభాగంలో ఏకంగా 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి? భవిష్యత్తులో మరిన్ని Layoffs ఉంటాయా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
న్యూయార్క్, జూలై 6: అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్దఎత్తున ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా తాజాగా ‘ఎక్స్‌బాక్స్’ గేమింగ్ విభాగం నుంచి 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కోత గేమింగ్ విభాగంలో ౨౦శాతం మందికి సమానమని చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీవో) అమీ కోల్‌మన్ ప్రకటించారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వల్ల సవాళ్లు ఎదురవుతాయని, అయితే అవసరమైన మార్పులన్నీ ఒకే రోజులో చేయడం సాధ్యం కాదని సీఈవో ఆశాశర్మ అభిప్రాయపడ్డారు. 2027 నాటికి ఎక్స్‌బాక్స్ విభాగం మళ్లీ వద్ధి పథంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో మైక్రోసాఫ్ట్ మొదటిసారిగా ఒకేసారి వలంటరీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్‌ను సైతం అమలు చేసింది. అమెరికాలోని సీనియర్ డైరెక్టర్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రైవ్ చేపట్టింది. నాడు అర్హులైన ఉద్యోగుల్లో మూడో వంతు కంటే ఎక్కువ మంది రిటైర్మెంట్ తీసుకున్నారు. భవిష్యత్తులోనూ అలాంటి విధానం అమలు చేసే అవకాశం ఉందని ఇప్పటికే కంపెనీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
MICROSOFT ఎందుకు ఉద్యోగులను తొలగిస్తోంది?
వ్యయ నియంత్రణ, సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా Microsoft Xbox గేమింగ్ విభాగంలో సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Q1. MICROSOFT ఎంత మంది ఉద్యోగులను తొలగించింది?
A: Microsoft Xbox గేమింగ్ విభాగంలో సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Q2. MICROSOFT LAYOFFSకు కారణం ఏమిటి?
A: సంస్థ వ్యయాలను తగ్గించడం, పునర్వ్యవస్థీకరణ చేపట్టడం, భవిష్యత్ వ్యాపార వ్యూహాలే ప్రధాన కారణాలుగా తెలిపింది.
Q3. ఏ విభాగంలో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు?
A: Xbox Gaming Divisionలో సుమారు 20% మంది ఉద్యోగులు ఈ Layoffs ప్రభావానికి గురయ్యారు.
Q4. MICROSOFT భవిష్యత్తులో మరిన్ని LAYOFFS చేయనున్నదా?
A: సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. అయితే భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.






