1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

ముందస్తు బెయిల్ ఇవ్వండి

20-11-2024 12:47 AM

ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పిటిషన్  

విజయవాడ, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మంగళవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ముందస్తు బెయిల్ మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

గత మార్చిలో వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమా పోస్టర్‌ను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ను కించపర్చేలా ఉందంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడుకి చెందిన ముత్తనపల్లి రామలింగయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజకీయ దురుద్దేశాలతో నమోదైన ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎవరి పరువు ప్రతిష్ఠ దెబ్బతినేలా తాను పోస్టులు పెట్టలేదని చెప్పారు. తనను పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేయనుంది.