calender_icon.png 27 October, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలి..

27-10-2025 05:40:10 PM

మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ..

మునుగోడు (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ రైతులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని సింగారం, జమస్థాన్ పల్లి గ్రామాలలో ఎఫ్పిఓ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, నాబార్డ్ సహాకారంతో సంహిత రైతు ఉత్పత్తి దారుల సంఘం లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్‌కు ఏ గ్రేడ్‌ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓ చైర్మన్ స్వామి గౌడ్, ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ ఆఫీసర్ శివశంకర్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, జమస్తాన్ పల్లి మాజీ సర్పంచ్ పంతంగి పద్మ స్వామి, ఏఈఓ నరసింహ, ఎఫ్పిఓ డైరెక్టర్లు జానారెడ్డి , మారేష్, సీఈవో రాంబాబు, రైతులు ఉన్నారు.