calender_icon.png 15 September, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆసియా కప్: యూఏఈపై భారత్ ఘన విజయం

21-07-2024 06:23:36 PM

మహిళల ఆసియా క్రికెట్ కప్ లో యూఏఈపై భారత్ ఘనవిజయం సాధించింది. ఆదివారం దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో యూఏఈపై 78 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మహిళల టీ-20లో భారత్ స్కోర్ తొలిసారి  200 పరుగులు దాటింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. రన్ ఛేజింగ్ కు దిగిన యూఏఈ ఏడు వికెట్లు కోల్పోయి 123లకే కుప్పకూలింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ అద్భుత అర్ధశతకాలతో భారత్‌ భారీ స్కోరును నమోదు చేసింది. బంతితో, దీప్తి శర్మ మరోసారి ఆకట్టుకుంది. ఈ విజయంతో గ్రూప్‌లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది.