calender_icon.png 15 September, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంపై ఉత్తమ్ అవగాహన లేకుండా మాట్లాడారు : హరీశ్ రావు

21-07-2024 06:10:00 PM

హైదరాబాద్: కాళేశ్వరంపై నీటీపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో పాలకపక్షానికి లబ్ధి చేకూర్చేలా ఎన్డీఎస్ఏ 2023 అక్టోబర్ లో హడావుడిగా నివేదిక ఇచ్చిందని హరీశ్ రావు తెలిపారు.  మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు ఎన్డీఎస్ఏను సలహాలు కోరినా స్పందించలేదని ఆయన చెప్పారు.

వరదలు రాకముందే సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందని, ఎన్డీఎస్ఏ నివేదిక కోసం కాంగ్రెస్ సర్కారు సమయాన్ని వృథా చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. బ్యారేజీ పునరుద్ధరణకు సూచనలు చేయడంలో ఎన్డీఎస్ఏ విఫలం అయిందని ఎద్దేవా చేశారు.

తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని ఉత్తమ్ అంటున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ ఎత్తున ప్రాజెక్టు కడతారో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సీఎం చవాన్ రాసిన లేఖను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదవాలని, తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయని హరీశ్ తెలపారు.