21-07-2024 09:13:19 PM
న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర మార్గంలో తినుబండారాలు, ఆహార దుకాణాల యజమానులు తప్పనిసరిగా తమ పేర్లను నేమ్‌ప్లేట్లపై ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆదేశాలను బాబా రామ్‌దేమ్ సమర్థించారు. ఆదివారం విలేకరులతో బాబా రామ్‌దేమ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్లు ప్రదర్శించడంలో అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు.
మనం చేసే పనిలో స్వచ్ఛత ఉంటే ఏ వర్గానికి చెందినవారైనా పట్టింపు లేదన్నారు. కన్వర్ యాత్ర మార్గంలో ఆహార దుకాణాల యజమానులు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ, వీహెచ్‌పీలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.