calender_icon.png 19 January, 2026 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న స్వామి స్టేడియానికి గ్రీన్ సిగ్న ల్

18-01-2026 12:00:00 AM

ఐపీఎల్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి అనుమతి

బెంగళూరు, జనవరి 17 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముం దు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి గొప్ప ఊర ట లభించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల ఆతిథ్యానికి చిన్నస్వామి స్టేడియానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) అధికారక ప్రకటన చేసింది. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు హోంశాఖ, కర్ణాట క రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు వెల్లడించింది. ప్రభుత్వం సూచించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని తెలిపింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలిచిన తర్వాత విక్టరీ పరేడ్ నిర్వహించారు.

దీనికి ఊహించని విధంగా అభిమానులు తరలిరావడం, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయా రు. అత్యంత విషాదరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేయడం, చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని నివేదిక ఇచ్చింది. ఈ కారణంగా మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా అక్కడి నుంచి త రలించారు. అయితే పలు చర్చల అనంతరం కొన్ని షరతులతో మ్యాచ్‌ల నిర్వహించుకునేందు కు ప్రభుత్వం ఆనుమతి ఇచ్చిం ది. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆతిథ్యానికి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.