calender_icon.png 19 January, 2026 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువ భారత్‌కు మరో విజయం

18-01-2026 12:00:00 AM

బులవాయో, జనవరి 17 : అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. తొలి మ్యాచ్‌లో అమెరికాను చిత్తు చేసిన భారత్ తాజాగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ౧౮ పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ వైభవ్ సూర్యవంశీ (72), వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు(80) రాణించడంతో భారత్ అండర్ 19 జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ రిఫత్(37), కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ (51) హాఫ్ సెంచరీతో రాణించడంతో మ్యాచ్ ఆసక్తకరంగా మారింది. మధ్యలో భారీ వర్షం రావడంతో టార్గెట్‌ను 29 ఓవర్లలో 165 పరుగులుగా నిర్ణయించారు. ఇక్కడ నుంచీ భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి పైచే యి సాధించారు. విహాన్ మల్హోత్ర 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు.