18-01-2026 12:00:00 AM
లానింగ్, లిచ్‌ఫీల్డ్ హాఫ్ సెంచరీలు
వుమెన్స్ ఐపీఎల్
నవీ ముంబై, జనవరి 17 : వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో పరా జయం ఎదురైంది. యూపీ వారియర్స్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ , లిచ్ ఫీల్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల కు 187 పరుగులు చేసింది. 5 పరుగుల దగ్గరే ఓపెనర్ నావ్‌గిరే వికెట్ కోల్పోయిన యూపీకి మెగ్ లాన్నింగ్, లిచ్‌ఫీల్డ్ అది రిపోయే భాగస్వామ్యంతో భారీస్కోరు అందించారు. ముంబై బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. మెగ్ లాన్నింగ్ 45 బంతుల్లోనే 70 (11 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. లిచ్ ఫీల్డ్ 37 బంతుల్లో 61 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసింది.
తర్వాత హ్యార్లిన్ డియోల్ (25), ట్రియోన్ (21)పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్ 3, నాట్ సివర్‌బ్రంట్ 2 వికెట్లు పడగొట్టారు. 188 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లు హీలీ మాథ్యూస్(13), సజన(10), బ్రంట్(15), హర్మన్‌ప్రీత్(18)నికోలా క్యారీ(6) నిరాశపరిచారు. దీంతో ముంబై 69 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. అయితే అమేలియా కెర్(49), అమన్ జోత్ కౌర్(41) పరుగులతో రాణించడంతో మ్యాచ్ కాసేపు ఆసక్తికరంగా సాగింది. చివర్లో యూపీ బౌలర్లు పుంజుకుని ముంబైని 6 వికెట్లకు 165 పరుగులకే కట్టడి చేసింది. ఈ సీజన్‌లో యూపీకి ఇది రెండో విజయం. అటు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ యూపీ చేతిలోనే ఓడిపోయింది.