వారిని విద్యశాఖలో విలీనం చేయాలి
మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ స్కీం వర్తింపజేయాలి
సీఎస్‌కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణలో ఉన్న 194 మోడల్ స్కూళ్లలో పనిచేసే రెగ్యులర్ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో విలీనం చేసి.. వారి వేతనాలను ‘010 హెడ్ ఆఫ్ అకౌంట్’ ద్వారా చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్ సంజయ్ జాజును సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది బదిలీలకు వెంటనే అనుమతులు మంజూరు చే యాలని కోరా రు. వీరికీ హెల్త్ స్కీంను వర్తింపజేయాలని తెలిపారు. డీఎస్సీ -2003 ద్వా రా ఎంపికైన అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల స మస్యలపైవ ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను ఎమ్మెల్సీ కోరారు.






