13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు గ్రీటింగ్స్

13-01-2026 02:25 AM

ఉప్పల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుందని ఉప్పల్ కార్పొరేటర్  రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని గృహలక్ష్మి  పథకం లబ్ధిదారులకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నుంచి వచ్చిన గ్రీటింగ్స్ కార్డును  ఆమె  లభిదారులుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లోని  గృహ లక్ష్మీ పథకం కింద  లక్ష కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

అర్హులై ఉండి  నెలకు 200 యూనిట్లు లోపు వినియోగించిన పేద మధ్య తరగతి కుటుంబాలకు జీరో బిల్ కింద ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు  సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని  ఇప్పటికే మహాలక్ష్మి పథకం గృహ లక్ష్మీ పథకం ప్రజలుసద్వినిచేసుకుంటున్నారని రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్  శాఖ లైన్మెన్ సుధాకర్ రెడ్డి రవి డివిజన్ అధ్యక్షుడు  లక్ష్మణ్  లింగంపల్లి రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి మహంకాళి రాజు పాల్గొన్నారు.