13-01-2026 02:24:47 AM
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంప ట్నం కళాశాలలోని ఇనిస్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శేఖర్ బాబు మాట్లాడుతూ.. వివేకానందుడు చెప్పినట్లుగా యువతే దేశానికి, సమాజానికి వెన్నె ముకలాంటివారని, యువత ఆలోచనలు, కృషి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ కండే శ్రీనివాస్, హెచ్‌ఓడీలు కీర్తివర్ధన్, రఘు, సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.