12 May, 2026 | 1:22 AM

రాజకీయ సంకల్పం లేకనే..!

12-05-2026 12:00 AM

భారత రాజ్యాంగం బీసీలు అంటే వెనుకబడిన కులాలుగా కాకుండా ‘వెనుకబడిన తరగతులు’గా నిర్వచించి వెనుకబడ్డ కులాలకు తీరని అన్యాయం చేసింది. ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబడిన తరగతులు అంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు. అదేవిధంగా ఆర్టికల్ 15(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులే బీసీలు. కేంద్ర ప్రభుత్వ లిస్ట్‌లో ఓబీసీలు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరం గా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొన్నప్పటికీ, వెనుకబడిన తరగతులు అంటే ఎవరు? వారిని ఏ ప్రా మాణికాల ఆధారంగా గుర్తించాలి? అనే అంశాన్ని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. ఇదే కారణంగా బీసీల సామాజిక న్యా యం ఆలస్యమైంది. న్యాయస్థానాల జోక్యం పెరిగి బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. అదే రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలను స్పష్టంగా నిర్వచించింది. నిజానికి హిందూ సామాజిక వ్యవస్థలోని 4వ వర్ణమే, అంటే నాటి శూద్రు లే నేటి బీసీలు. బీసీలు ఒక సజాతియ స మూహం కాదు; ఇందులో ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార, అర్ధ సంచార జాతులు, ఆశ్రిత కులాలు మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ కులాలన్నీ ఒకే సామా జిక, రాజకీయ, ఆర్థిక స్థితిలో లేవు.

రాజ్యాం గం బీసీలను వెనుకబడిన కులాలుగా కా కుండా వెనుకబడిన తరగతులుగా నిర్వచించడం వల్ల బీసీల గుర్తింపు, హక్కుల అమలు విషయంలో దశాబ్దాల పాటు అనేక చట్టపరమైన, రాజకీయ అవరోధాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో జీవో ఎంఎస్ నెంబర్ 3, తేదీ 09 ప్రకారం 130 కులాలను బీసీ బీసీ బీసీన బీసీ బీసీ ఈ వర్గాలుగా విభజించారు. కేంద్ర ఓబీసీ జాబితాలో సుమారు 2,633కి పైగా కులా లు ఉండగా, దేశవ్యాప్తంగా రాష్ట్రాల జాబితాలు కలిపితే దాదాపు 5,000 వరకు బీసీ కులాలు ఉన్నాయని వివిధ అంచనాలు సూచిస్తున్నాయి. 

ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల పరిస్థితిని అధ్యయనం చేసి, వారికి విద్య, ఉద్యోగ, సామా జిక, ఆర్థిక రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు కమిషన్‌ను నియమించవచ్చని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1953లో నాటి ప్రధాని నెహ్రూ అంబేద్కర్ ఒత్తిడి మేరకు కాకా కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ 2,399 కులాలను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి 1955లో నివేది క సమర్పించగా, నెహ్రూ ఆ దాన్ని అమలు చేయకుండా, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండానే తిరస్కరించారు.

చివరకు 1961లో ఒక మెమో ఇచ్చి ఇక బీసీలను రాష్ట్రాలే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో ఆర్థికపరంగా మా త్రమే బీసీలను గుర్తించాలని వారు సూచించారు. తర్వాత జనతా ప్రభుత్వ కాలంలో, ములాయం సింగ్, లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ మొదలగు యాదవ నాయకులు, చరణ్ సింగ్ వంటి నాయకుల ఒత్తిడి తో రెండో బీసీ కమిషన్‌గా మండల్ కమిషన్ 1977లో ఏర్పడింది. ఈ కమిషన్ 11 సామాజిక, విద్య, ఆర్థిక సూచికల ఆధారం గా 3,743 కులాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించింది.

అయితే బీసీలను కులాల ప్రాతిపదికన గుర్తించడం సరైంది కాదంటూ కోర్టుల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తెలంగాణలోనూ 1960 దశకాల్లో వచ్చిన రెండు జీవోలైన 1886 తేదీ 21 1880 తేదీ 29 లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అనంతరామన్ కమిషన్ సిఫారసు లపై ఇచ్చిన జీవో 1793 తేదీ 23 1970ని కూడా హైకో ర్టు కొట్టివేయగా 1972 జనవరిలో సుప్రీంకోర్టు ఇది న్యాయసమ్మతమే అని తీర్పు ఇవ్వగా, అప్పటినుంచి అమలువుతున్నాయి. సుప్రీంకోర్టు కులం కూడా ఒక సామాజికవర్గమే అని స్పష్టం చేస్తూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించింది.

మండత్ కమిషన్ రిపోర్టు న్యాయసమీక్షపై 1992లో వచ్చిన చారిత్రాత్మక ఇంద్రా సహాని తీర్పు బీసీ రిజర్వేషన్లకు కీలక మలు పు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు కులాన్ని సా మాజిక వెనుకబాటుతనానికి ప్రధాన ప్రమాణంగా అంగీకరించింది. అదే సమయంలో 50% రిజర్వేషన్ పరిమితి అనే భావనను కూడా ప్రవేశపెట్టింది. తర్వాత కాలంలో ఇం ద్రాసహాని కేసు ఆదేశాల మేరకు రాజ్యాంగంలో 340 అధికరణం అధికారికంగా 1993లో జాతీయ వెనుకబడిన చట్టాన్ని చేశారు. 2018లో ఈ జాతీయ వెనుకబడిన చట్టాన్ని రద్దుచేసి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 338 బి చేర్చి వెనుకబడిన తరగతుల జాతీ య కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

తద్వారా అది రాజ్యాంగ ప్రతిపత్తి గల సంస్థగా ఆవిర్భవించింది. అదేవిధంగా బీసీల నిర్వచ నానికి వస్తే రాజ్యాం గంలో 102వ సవరణ ద్వారా చేర్చిన అధికరణం 366 (26సీ) వెనుకబడిన తరగతులు ఎవరనేది నిర్వచించింది. ఈ నిర్వచనం ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అంటే ఈ రాజ్యాంగం ప్రయోజనాల కోసం అధికరణం 342ఏ లో పేర్కొన్న వర్గాలు. అదే విధంగా రాజ్యాంగంలోని 342 ఏ1, అండ్ ఏ2 కింద కేంద్రం తన సొంత సామాజికంగా, విద్యబడిన వెనుకబడిన తరగతుల జాబితా నిర్వహించుకో వచ్చు. అలాగే 342 ఏ3 కింద రాష్ట్రాలు నిర్వహించుకోవచ్చు.

ఇప్పుడు బీసీలంటే ఎవరు అనే రాజ్యాంగ గుర్తింపు వచ్చింది. రాజ్యాం గం వెనుకబడిన తరగతులను స్పష్టంగా నిర్వచించకపోవడంతో సామాజిక న్యాయం అందడంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కేంద్రంలో 1993 నుంచి మాత్రమే ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వ చ్చాయి. అంటే దాదాపు 46 ఏళ్లు కేంద్రం లో రిజర్వేషన్లు లేవు. ఆ సందర్భంలో సృష్టించిన అనేక లక్షల ఉద్యోగాలు బీసీలకు అం దుబాటులో లేకుండా పోయాయి. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు 22 శాతానికి మించి లేరు. రాష్ట్రాల్లోనూ 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది. స్వాతం త్య్రం కొత్తలో సృష్టించిన లక్షల ఉద్యోగాలకు వారు దూరమయ్యారు. అందుకే నేడు బీసీ వర్గాలకు ఈ దుస్థితి.

50% సీలింగ్‌ను బ్రేక్ చేయవచ్చా?

ముఖ్యంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే అంశం ప్రాథమిక హక్కుల విభాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 16(4) ప్రకారం తగు ప్రాతినిధ్యం లేని వర్గాలకు రిజర్వేషన్ ప్ర యోజనం కల్పించాలి. కానీ, అందులో ఎంత శాతం కల్పించాలనే విషయాన్ని ఎక్క డా చెప్పలేదు. ఈ లొసుగును ఆధారంగా చేసుకొని కోర్టులు 50 శాతానికి మించి ఇవ్వకూడదని వ్యాఖ్యానం చేయడం మొదలు పెట్టాయి.

మొట్టమొదట 1961లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో అడ్మిషన్లు 50% దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి 50 శాతంలో మిగతాది మాత్రమే బీసీలకు ఇవ్వాలని కోర్టు తీ ర్పు ఇచ్చింది. ఆ తీర్పును అనేక కోర్టులు తమకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకుం టూ ఎక్కడ బీసీలకు 50 శాతం దాటినా అడ్డుకున్నాయి. స్వతంత్ర భారతంలో 8 రా ష్ట్రాలలో ఇలా అడ్డుకున్నాయి. 

మన సం యుక్త ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1986లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పి స్తూ జీవో ఇస్తే హైకోర్టు కొట్టివేసింది. అందుకే మన దగ్గర కూడా అనంతరామన్ కమిషన్ గాని (30%), మండల్ కమిషన్ (27%) గాని 50 శాతానికి లోబడే సిఫారసు చేశాయి. అయితే ఈ 50% పరిమితి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కోర్టుల వ్యాఖ్యానం మాత్రమే. అంతేకాదు, ఇంద్రా సహాని తీర్పులో పారా 830 ప్రకా రం ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని అధిగమించవచ్చని కూడా పేర్కొన్నారు. తెలంగాణ ఒక ప్రత్యేక సామాజిక-చారిత్రక నేపథ్యం కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జనాభా కలిపి సుమారు 90 శాతానికి చేరువలో ఉంటుంది.

అదే సమయంలో పేదరికం, సామాజిక వెనుకబాటుతనం కూడా అధికమే. శతాబ్దాల పా టు కొనసాగిన రాచరిక, భూస్వామ్య వ్యవస్థల ప్రభావంతో బలహీనవర్గాలు తీవ్రంగా నలిగిపోయాయి. అందువల్ల తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ల అవసరం మరింత ఎక్కువగా ఉం టుంది. బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక, విద్య పురోగతిని దృష్టిలో పెట్టుకొని 50% సీలింగ్‌ను దాటి రిజర్వేషన్లు ఇవ్వడానికి చారిత్రక, సామాజిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సీలింగ్‌ను బ్రేక్ చే యడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

తెలంగాణలో 42% సాధ్యమా?

తెలంగాణలో బీసీల జనాభా సుమారు 56%కి పైగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక సర్వే చెబుతోంది. అయినప్పటికీ వారికి 29% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. ఇది తగిన ప్రాతినిధ్యం కాదు. అందుకే కామారెడ్డి డిక్లరేషన్లో తాము అధికారంలోకి వచ్చిన త ర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాం గ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2025లో రాష్ట్ర అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. వాస్తవానికి ఇవి జనాభా దామాషా ప్రకారం ఇచ్చి నవి కావు. తగు ప్రాతినిధ్యం లేదని 56.33 % జనాభాకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు. 10% లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వవచ్చు కానీ, 56% బీసీలకు 42% ఇవ్వకూడదు. ఇదెక్కడి సామాజిక న్యాయం? 

తమిళనాడు సా మాజిక న్యాయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. అక్కడ ప్రత్యేక చట్టం ద్వారా 69% రిజర్వేషన్లను అమలు చేస్తూ, దాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. బీసీలకు చట్టబద్ధంగా 50% రిజర్వేషన్లు ఇ స్తున్నారు. ఇప్పటికీ ఆ చట్టం అమల్లో ఉంది. అయితే 2007లో I.R. Coelho vs State of Tamil Nadu Judgment (సిసిరో కేసు అని కూడా పేర్కొంటారు)లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు కూడా పూర్తిగా న్యాయసమీక్షకు అతీతం కావని, అవి రా జ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉం టే మాత్రమే కోర్టులు పరిశీలిస్తాయని స్ప ష్టం చేసింది. ఇప్పటివరకు 9వ షెడ్యూల్‌లో సుమారు 284 చట్టాలను చేర్చినప్పటికీ, వాటిలో ఏ ఒక్క చట్టాన్నీ సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. 

అలాగే 2022లో జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పు ఇస్తూ, 50% రిజర్వేషన్ పరిమితి రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశం సిసిరో తీర్పులో కూడా ప్రతిధ్వనించింది.  రాజ్యాం గ మౌలిక సూత్రాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే న్యాయ సమీక్ష వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. కాబట్టి తెలంగాణలో ప్రతిపాదిత 42% రిజర్వేషన్ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల ఎలాంటి రాజ్యాంగపరమైన ప్రమాదం ఉండదని చెప్పవచ్చు. అంతేకాదు, అలా చేయడం ద్వారా ఆ చట్టాలకు మరింత బలమైన రాజ్యాంగ రక్షణ లభించే అవకాశం ఉంటుంది. 

ఇక్కడ ప్రధాన సమస్య రాజకీయ సంక ల్పం లేకపోవడం. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఆధిపత్య కులాల చేతుల్లో ఉండటంతో, బీసీల నిజమైన సాధికారతపై వారికి ఆసక్తి తక్కువ. కేవలం ప్రకటన లు, జీవోలు, కమిటీలు పెట్టి కాలయాపన చేస్తున్నారు. ఆయా పార్టీల్లోని బీసీ నాయకులూ తమ పార్టీలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే పరిస్థితిలో లేరు. అగ్రవర్ణ, ఆధిపత్య మీడియా మన సమస్యలను హైలై ట్ చేయదు.

అందుకే ఈ పోరాటాన్ని ముం దుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్వతంత్ర విద్యార్థులు, బీసీ సంఘాలు, మేధావులు, రచయి తలు, కవులు, కళాకారులు, యువతపై ఉంది. చరిత్ర చెబుతోంది, ఉద్యమం లేకుం డా హక్కులు రావని. 1951లో జరిగిన మొ దటి రాజ్యాంగ సవరణ కూడా తమిళనాడులో పెరియార్ ఉద్యమ ఒత్తిడితోనే సాధ్య మైంది. అదే ఉద్యమ స్ఫూర్తి తెలంగాణలో నూ అవసరం. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీ సీలు కలిపి సుమారు 90% ఉన్నారు. అయినప్పటికీ అధికారం, విద్య, ఉద్యోగాలు, సం పద, మీడియా, న్యాయవ్యవస్థ వంటి కీలక రంగాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ.

కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ కేవలం ఒక రాజకీయ డిమాండ్ కాదు; అది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న చారిత్రాత్మక పోరాటం. ఈ హక్కులు ఎవ్వరూ స్వచ్ఛందంగా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి కళాశాలలో, ప్రతి వృత్తి వర్గంలో చైతన్యం తీసుకెళ్లాలి. 42% రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ సమాజం మ రో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వాలు దిగొచ్చి ఈ డిమాండ్‌ను సాకారం చేస్తాయి.

వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్

టీ చిరంజీవులు