సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
ముస్తఫానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంబించిన సర్పంచ్ బండ సుకన్య
గంభీరావుపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ బండ సుకన్య-దేవయ్య భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివంది దేవేందర్, వార్డు సభ్యులు చెరిపల్లి సరస్వతి, వీరబోయిన రమేష్, దోమకొండ కృష్ణ, కాంతి యాదవ్, చెరుపల్లి సాగర్, మారబోయిన లావణ్య, కార్యదర్శి కుమార్, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






