అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్
షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పక్రటించింది. ఈమేరకు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే మెయిన్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. ప్రతి పేపర్‌కు మూడు గంటలు సమయమిచ్చారు. ప్రతీ పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో పరీక్షలు జరుగుతాయి. ఏడు రోజుల్లో పరీక్షలు పూర్తవుతాయి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ని టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈనెల 9న పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీ ని ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాథమిక కీతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంచారు. అభ్య ర్థులు తమ లాగిన్ ద్వారా కీని సరిచూ సుకొని, ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా పంపిస్తేనే పరిగణలోకి తీసుకుం టామని కమిషన్ ఈమేరకు స్పష్టం చేసింది.
షెడ్యూల్ ఇలా..
సబ్జెక్టు పరీక్ష మార్కులు తేదీ
సమయం
జనరల్ ఇంగ్లీష్ 3 గంటలు 150 అక్టోబర్ 21
పేపర్1 జనరల్ ఎస్సే 3 150 అక్టోబర్ 22
పేపర్2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ 3 150 అక్టోబర్ 23
పేపర్3, ఇండియన్‌సొసైటీ, 3 150 అక్టోబర్ 24
కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
పేపర్4 ఎకానమీ అండ్ 3 150 అక్టోబర్ 25
డెవలప్‌మెంట్
పేపర్5 సైన్స్, టెక్నాలజీ, డేటా 3 150 అక్టోబర్ 26
ఇంటర్‌ప్రిటేషన్
పేపర్6 తెలంగాణ మూవ్‌మెంట్ 3 150 అక్టోబర్ 27
అండ్ స్టేట్ ఫార్మేషన్






