calender_icon.png 6 August, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-2 వాయిదా

20-07-2024 12:58:46 AM

  1. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్ష డిసెంబర్‌లో 
  2. అధికారికంగా వెల్లడించిన టీజీపీఎస్సీ

నిరుద్యోగులతో చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి 

అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష వాయిదా 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): గ్రూప్-2 పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆగస్టు ౭,౮ తేదీల్లో జరగాల్సిన పరీక్షను ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం అధికారికంగా ప్రకటిం చింది. పరీక్ష నిర్వహించే కచ్చితమైన తేదీలను త్వరలో వెళ్లడిస్తామని పేర్కొన్నది. గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని కొన్ని రోజులుగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఒక రోజు విరామంతో గ్రూప్- ౨ పరీక్షలు ఉన్నాయి. దీంతో తమకు ఇబ్బందులు తలెత్తుతున్నందున ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కోరారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయటానికి ఒప్పుకోని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తున్నది. దీంతో గ్రూప్ వాయిదా వేసింది. 

నిరుద్యోగులతో భట్టి చర్చలు

గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న పలువురు నిరుద్యోగులతో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం మధ్యాహ్నం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీంతో టీజీపీ ఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డికి భట్టి వెంటనే ఫోన్ చేసి గ్రూప్-2 వాయిదాను పరిశీలించాలని ఆదేశించారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్‌లో నిర్వహణపై పరిశీలించాలని కోరారు. మూడు నెలల్లోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించినట్లు ఆయన తెలిపారు. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని అన్నారు. గత ప్రభుత్వం మొదటి పదేళ్లలో ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుందని, కానీ తాము అలా ఆలోచించ డంలేదని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిదని చెప్పారు.

వాయిదా.. నాలుగోసారి

౭౮౩ పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ౨౦౨౨ డిసెంబర్ లో విడుదల చేసింది. 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని మొదట టీజీపీఎస్సీ నిర్ణయించింది. కానీ అభ్యర్థుల కోరిక మేరకు ౨౦౨౩ నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావటంతో మరోసారి వాయిదా వేసిం ది. ఈ ఏడాది జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఆగస్టు 7, 8వ తేదీలకు మర్చారు. నాలుగోసారి డిసెంబర్‌కు వాయిదా వేశా రు. గ్రూప్-2 పరీక్షకు 5.51 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు రాస్తున్న 2.79 లక్ష ల మంది అభ్యర్థుల్లో సుమారు లక్ష వరకు గ్రూప్-2 పరీక్షకు కూడా సన్నద్ధమవుతున్నా రు. దీంతోపాటు 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్ గ్రూప్ పరీక్షలకు దాదాపు ఒకే సిలబస్ ఉన్నది. 

త్వరలో కొత్త తేదీలు

గ్రూప్-2 పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అయి తే డిసెంబర్ నెలలో ఏవైనా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఉన్నాయో లేదో చూసుకొని అనుకూలమైన తేదీలను ఖరా రు చేయనున్నారు. ఏ తేదీలు పరీక్షల నిర్వహణకు అనువుగా ఉన్నాయో చర్చించి ఖరారు చేసి ఆ తర్వాత ప్రకటించనున్నారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

వాయిదా ఓకే.. పోస్టులూ పెంచాలి

గ్రూప్-2ను వాయిదా వేయడంపై నిరుద్యోగులు, అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు పరీక్షను వాయిదా వేసిన ప్రభుత్వం, పోస్టులను కూడా పెంచి పరీక్ష నిర్వహించాలని కోరారు. డీఎస్సీ, గ్రూప్-1 నోటిఫికేషన్లకు పోస్టులు పెంచిన ప్రభుత్వం, గ్రూప్-2 పోస్టులు కూడా పెంచాలని గ్రూప్-2 అభ్యర్థులు మఠం శివానంద స్వామి, మహేష్, స్రవంతి, అభినవ్, ఇంద్రప్రసాద్ నాయక్ తదితరులు విజ్ఞప్తి చేశారు.