calender_icon.png 7 August, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీలకు వీసీలేరి?

20-07-2024 01:01:20 AM

* పది యూనివర్సిటీలకు  వీసీల పోస్టుల కోసం 1,382 దరఖాస్తులు అందాయి. గత మార్చిలోనే ఈ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో వీసీల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ ముగిసిన తర్వాత తొమ్మిది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. ఈ సెర్చ్ కమిటీలు సమావేశమై ఒక్కో యూనివర్సిటీ నుంచి ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

  • పూర్తిస్థాయి వీసీలు లేక పాలన అస్తవ్యస్థం

అసెంబ్లీ సమావేశాల తర్వాతే కొత్త వీసీలు!

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు, పరిశోధనలకు నెలవుగా ఉండాలి.. పరిస్థితులు మారాయి.. ఇప్పుడవి సమస్యలకు నిలయాలుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో అరకొర వసతులు, చాలీచాలని నిధుల కేటాయింపు, పదుల సంఖ్యల్లో ఖాళీలతో యూనివర్సిటీలు కునారిల్లాయి. 

ఈ ప్రభుత్వంలోనైనా వాటి రూపురేఖలు మారుతాయనుకుంటే అత్యాశే అవుతున్నది. యూనివర్సిటీల వీసీల పదవీకాలం పూర్తయి రెండు నెలలు కావొస్తోంది. అయినా ఇంతవరకూ పూర్తిస్థాయి వీసీలను ప్రభుత్వం నియమించలేదు. ఇన్‌ఛార్జి వీసీలుగా ఐఏఎస్‌లను నియమించడంతో పాలన గాడి తప్పుతున్నది. యూనివర్సిటీల్లోని హాస్టళ్లలో విద్యా ర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పూర్తిస్థాయి సౌకర్యాలు, మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

మసకబారుతున్న వర్శిటీల ప్రతిష్ఠ..

యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇచ్చే  నిధు ల్లో ఎక్కువ శాతం జీతాలకే సరిపోతున్నది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భారీగా ఖాళీలున్నాయి. ఇక హాస్టళ్లలో సమస్యలు అనే కం. కనీస సౌకర్యాలను విద్యార్థులకు కల్పించడంలేదు. అప్పటికప్పుడు పరిష్కరించగ లిగే సమస్యలను కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. బాత్రూంలకు సరిగా డోర్లు ఉండవు, కిటికీలకు తలుపులు ఉండవు. పైకప్పు పెచ్చులు, ఫ్యాన్లు ఊడి  నిద్రపోతున్న విద్యార్థులపై పడిన ఘటనలు అనేకం. తినే టిఫిన్‌లో, భోజనం, కూరలో, చట్నీల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని పది యూనివర్సిటీల్లో ఏదోచోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుకోవాలంటే ఆందోళనలు, నిరసనలతో తమ హక్కులను సాధించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటికితోడూ కాంట్రాక్టులు, ఉద్యోగ నియామ కాల్లో, పీహెచ్‌డీ సీట్ల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు వస్తుండటంతో యూనివ ర్శిటీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. గత ప్రభుత్వ హయాంలో వీసీల నియామకంలో రాజకీయాల జోక్యం తెలంగాణలో ప్రస్ఫుటంగా కనిపించింది.

ఇన్‌చార్జీలే దిక్కు..

ఈ ఏడాది మే 21తో రాష్ట్రంలోని పది యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వీరి పదవీ కాలం ముగియకముందే కొత్త వీసీలను నియమిస్తామని ప్రకటించింది. కానీ ఇంత వరకూ రెగ్యులర్ వీసీలను నియమించకుండా ఇన్‌ఛార్జి వీసీలను నియమించి చేతులు దులుపుకుంది. ఇన్‌ఛార్జి వీసీలు ఐఏఎస్‌లు కావడం, వారికి ఇప్పటికే మిగతా ముఖ్యమైన శాఖల బాధ్యతలుండటంతో వర్సిటీ పాలనపై పూర్తి స్థాయిలో వారు దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలున్నాయి.

అసెంబ్లీ సమావేశాల తర్వాతనే!

నిజానికి విద్యాశాఖ పరిధిలో 12 యూనివర్శిటీలున్నాయి. అందులో ఆర్జీయూకేటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, కాకతీయ, ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాల మూరు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలున్నాయి. అయితే ఆర్జీయూకేటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీలు మినహా 10 వర్సిటీల్లో వీసీల నియామకానికి జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఆర్జీయూకేటీ వర్సిటీని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసినప్పుడు మిగ తా వర్సిటీలకు భిన్నంగా ఉండేలా వర్సిటీకు గవర్నర్ ఛాన్స్‌లర్ ఉండకుంగా విద్యావేత్తను నియమించేలా చట్టం తీసుకొచ్చింది.

ఆర్జీయూకేటీతోపాటు, మహిళా వర్సిటీలకు వీసీ లను నియమించాలంటే చట్టంను తీసుకురావాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే పది వర్సిటీ  వీసీల పోస్టుల కోసం 312 మంది ప్రొఫెసర్ల నుంచి 1,382 దరఖాస్తులు అందాయి. గత మార్చి నెలలోనే ఈ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో వీసీల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియలో అధికారులు వేగంపెంచి తొమ్మిది వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. ఈ సెర్చ్ కమిటీలు సమావేశమై ఒక్కో వర్సిటీ నుంచి ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

కానీ ప్రభుత్వం ఈ సెర్చ్ కమిటీలతోనే సరిపెట్టుకొని రెగ్యులర్ వీసీలను నియమించకుండా ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల తర్వాత కొత్త వీసీలను ప్రభు త్వం నియమించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా... వీసీల నియామకానికి సంబందించి సామాజిక సమీకరణాలు కుదరలేదని తెలుస్తోంది. కొంతమంది మంత్రు లు తాము సిఫార్సు చేసిన వారిని వీసీలుగా నియమించాలని సీఎంకు ప్రతిపాదించడంతో ఈ పక్రియను అసెంబ్లీ సమావేశాల వరకు వాయిదా వేసినట్లు సమాచారం.

ఏళ్లతరబడిగా పోస్టులు ఖాళీ...

అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 2013 నుంచి ఇప్పటివరకూ నియామకాల ప్రక్రియ జరగనేలేదు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కేవలం 24 శాతం వరకు మాత్రమే రెగ్యులర్ పోస్టులున్నాయి. వీటికి తోడు ప్రతీ ఏడాది రిటైర్ అవుతున్నవారి స్థానంలో కొత్త వారు రావడంలేదు. కాంట్రాక్టు, పార్ట్‌టైం పద్ధతిలో అధ్యాపకులను భర్తీ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో కోర్సులు మూసివేస్తున్నారు. ఏండ్లుగా ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో యూనివర్శిటీలకు న్యాక్ గ్రేడ్ కూడా పెరగడంలేదు. మరోవైపు ప్రొఫెసర్ల కొరతతో వర్శిటీల్లో సరైనా పరిశోధనలు జరగడంలేదనే విమర్శలూ ఉన్నాయి.

అన్ని వర్సిటీల్లో కలిపి సుమారు 4,500 వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా యూనివర్సిటీల్లో ఖాళీలు నింపుతామని అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రకటించింది. అయితే ఈ బోర్డు ఫైలు రాష్ట్రపతి కార్యాలయంలో ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాత పద్ధతిలోనే (ఏ యూని వర్సిటీకి ఆ యూనివర్సిటీయే) నియామకా లు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో యూనివర్సిటీల పరిస్థితి మారుతుందని విద్యార్థులు భావించా రు. కానీ, అప్పటికి ఇప్పటికీ పరిస్థితి ఏమా త్రం మారలేదని పలు విద్యార్థి సంఘాలు, మేథావులు ఆరోపిస్తున్నారు.

పదేళ్లుగా నియామకాల్లేవు

యూనివర్సిటీల్లో గత పదేళ్లుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ లేకపోవడం, మౌలికవసతులు కల్పించడం లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బడ్జెట్‌లోనూ వర్సిటీల అభివృద్ధికి అధిక నిధులను కేటాయించట్లేదు. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంలేదు. అన్ని వర్సి టీల వీసీల నియామకం 15 రోజుల్లో చేస్తామన్న సీఎం... రెండు నెలలవుతున్నా పూర్తిచేయలేదు. ఇన్‌ఛార్జి వీసీలతో విద్యాప్రమాణాలు తగ్గుతాయి. రాజకీయాలకు అతీతంగా వీసీలను నియమించాలి.

 కసిరెడ్డి మణికంఠరెడ్డి, 

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

జూన్ 15 పాయే..

యూనివర్సిటీల్లో వీసీలను జూన్ 15 నాటికే నియమిస్తామని ప్రభుత్వం చెప్పి, ఇప్పటికీ నియమించలేదు. దీనివ ల్ల పరిపాలన కుంటుపడుతోంది. అనేక సమస్యలు వర్సిటీల్లో అపరిష్కృతంగా ఉన్నాయి. తక్షణమే వీసీలలను నియమిం చి, ఖాళీలను భర్తీ చేయాలి. పారదర్శకంగా వీసీలను నియమించాలి. ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

 టీ నాగరాజు, 

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి