15-10-2025 06:32:22 PM
పంచాయితీ కార్యదర్శి తుల్జారాణి..
రేగొండ (విజయక్రాంతి): చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీలో ఇస్తున్న పోషక విలువలతో కూడిన పదార్థాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తుల్జారాణి తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు పోషణ మాసంలో నిర్వహించడం భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల పరిధిలో రెండవ సెక్టార్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా పంచాయతీ కార్యదర్శి తుల్జారాణి, రేగొండ సెక్టర్ సూపర్వైజర్ సంధ్య, పాల్గొని వారు మాట్లాడుతూ, ప్రతి చిన్నారి, గర్భిణీ, బాలింత, కిషోర బాలికలు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఎదగాలి. మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, చిరుధాన్యాలు తింటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి.
అలాగే పాలు, గుడ్లు, నువ్వులు, బెల్లం, వేరుశనగ, చెనగ వంటివి తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చని వివరించారు. పౌష్టికాహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులు కిశోర బాలికలు సమతుల ఆహారం తీసుకోవాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకోవాలని రక్తహీనత పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం పోషణ మాసం మహోత్సవంలో భాగంగా పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. పలువురు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని తల్లులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఉమ మహేశ్వరి సుజాత, విమలదేవి నామాల రజిత, ఆయాలు శ్రీలత, సౌందర్య, రాజేశ్వరి, ఇంద్ర, ఎఎన్ఎం యాదలక్ష్మి, ఆశ వర్కర్స్ ఆసినా, సుభద్ర, తల్లులు తదితరులు పాల్గొన్నారు.