15-10-2025 06:34:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టల్ లో విధులు నిర్వహిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు కష్టపడి పనిచేసి శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సలావుద్దీన్ ప్రధాన కార్యదర్శిగా ఎస్కే సులేమాన్. సంయుక్త కార్యదర్శిగా ఫిరోజ్ ఖాన్ తో పాటు నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధికారులు కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరేష్ సాయన్న ఆడిల్లా రమేష్ పర్వీజ్ ఖాన్ విట్టల్ రాజు తదితరులు పాల్గొన్నారు.