calender_icon.png 31 July, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం

30-07-2025 04:53:09 PM

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) అనే భూమి పరిశీలన ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగించడాన్ని వీక్షించేందుకు పలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని సనందన మిత్రా మాట్లాడుతూ.. ఇవాళ శ్రీహరికోటలో ఇస్రో, నాసా ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించడానికి వచ్చానని, ఎన్ఐఎస్ఏఆర్(NISAR) ప్రయోగానికి నాసా, ఇస్రోకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని పాఠశాల విద్యార్థిని సనందన మిత్రా చెప్పింది.

జియో సింక్రొనస్ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ-ఎఫ్ 16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు ఉన్న నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. 98.40 డీగ్రిల వంపుతో భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య-సమకాలిక కక్ష్యలోకి నిసార్ ప్రవేశించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారుగా 10 ఏళ్లపాటు సేవలందించనుంది. ఇస్రో ఛైర్మన్ డా.కె.నారాయణ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.