30-07-2025 06:23:04 PM
తిరుపతి: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జియో సింక్రొనస్ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ-ఎఫ్ 16) రాకెట్ బుధవారం సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) అనే భూమి పరిశీలన ఉపగ్రహాన్ని తొలిసారిగా సంయుక్తంగా రూపొందించాయి. జియో సింక్రొనస్ లాంచింగ్ వెహికల్(జీఎస్ఎల్వీ-ఎఫ్ 16) రాకెట్ 2,392 కేజీల బరువు ఉన్న నిసార్ ఉపగ్రహాం నింగిలోకి బయలుదేరింది.
98.40 డీగ్రిల వంపుతో భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య-సమకాలిక కక్ష్యలోకి నిసార్ ప్రవేశించనుంది. దీని కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లను సమూర్చగా.. భారత్ 90 మిలియన్ "డాలర్లను ఖర్చు చేసింది. అంతరిక్షంలో ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారుగా 10 ఏళ్లపాటు సేవలందించనుంది. ఇస్రో ఛైర్మన్ డా.కె.నారాయణ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.