calender_icon.png 1 August, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైదంబండలో ప్రధాన రహదారిపై నిర్మించిన గోడ గోవిందా...

31-07-2025 08:48:36 AM

(విజయక్రాంతి కథనానికి స్పందన) 

గోడను ట్రాక్టర్ తో కూల్చివేసిన అధికారులు

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని(Mutharam Mandal) మైదాంబండ గ్రామంలో ఏకంగా ప్రధాన రహదారిని కబ్జా చేశాడని ఇటీవల (Vijaya Kranthi) పత్రికలో వార్త ప్రచురితం కాగా, స్పందించిన అధికారులు  ప్రధాన రహదారిని కబ్జా చేసి నిర్మించిన గోడ ను ట్రాక్టర్ తో నేలమట్టం చేశారు. గ్రామానికి చెందిన పుట్ట ఎర్ర ఓదెలు తన ఇంటి ముందు ప్రభుత్వం నిర్మించిన సిమెంటు రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మించాడు. గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, ఆ గోడను తీసివేయాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయక్రాంతి పత్రికల్లో(Vijaya Kranthi News Paper) వచ్చిన వార్త కు స్పందించిన ఎంపీడీవో సురేష్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండి ట్రాక్టర్ తో గోడను కూల్చివేశారు. దీంతో గ్రామస్తులు అధికారులకు (విజయక్రాంతి) పత్రిక కు కృతజ్ఞతలు తెలిపారు.