31-07-2025 08:51:26 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం(Kesamudram Mandal) నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్ శిరీష దంపతుల కుమారుడు మనీష్ కుమార్ (6) అనే బాలుడు పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న బాలుడి మెడపై పలుచోట్ల కత్తితో దాడి చేశారు. దీంతో బాలుడు లేచి కేకలు వేయడంతో తల్లిదండ్రులు మేల్కొనే సరికి దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడికి చికిత్స చేయిస్తున్నారు. సంఘటనపై కేసముద్రం రెండవ ఎస్ ఐ నరేష్ దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.