31-07-2025 08:34:55 AM
మునగాల:(విజయక్రాంతి): మునగాల మండల కేంద్రంలో నేడు ముత్యాలమ్మ (Bonalu festival) పండగ నిర్వహిస్తున్నట్లు ముత్యాలమ్మ కమిటీ రైతు కమిటీ గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. మంగళవారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో కమిటీలు గ్రామ పెద్దలు నిర్ణయించారు. ప్రతి ఏటా శ్రవణ మాసం మొదటి వారం గురువారం ముత్యాలమ్మ పండగ నిర్వహించే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవాల్సిందిగా కోరారు.