1 April, 2026 | 7:18 AM

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన ప్రజలు

15-05-2024 02:41 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట, మే 14 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగిన పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలందరికీ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెలిబుచ్చే ఈ పవిత్ర కార్యంలో పాల్గొని ప్రజాస్వామ్యం స్ఫూర్తిని ప్రదర్శించిన మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించిన అధికారులు, పోలీసులందరిని అభినందించారు. ప్రత్యేకించి 50 రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించిన బీఆర్‌ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషితో పోలింగ్ శాతం పెరిగిందన్నారు.