RCB vs GT IPL 2026: గెలుపు బాట పట్టేదెవరు?
ఆర్‌సీబీతో గుజరాత్ ఢీ
చిన్నస్వామిలో పరుగుల వరదే
బెంగళూరు, ఏప్రిల్ 23: ఐపీఎల్ 19వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో హోం మ్యాచ్‌కు రెడీ అయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 6 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు నాలుగింటిలో గెలిచింది.
IPL 2026 పాయింట్ టేబుల్, నేటి మ్యాచ్ preview లు తెలుగులో చదవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.
రెండింటిలో పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపి టల్స్ పై ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఆర్సీబీ ఓటమికి కారణం. ఫిల్ సాల్ట్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. కానీ ఓవరాల్‌గా ఆర్సీబీ మాత్రం తన హోదాకు తగ్గట్టే ఆడుతోంది. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లంతా గెలిచిన మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించారు. కోహ్లీతో పాటు పటిదా ర్, పడిక్కల్, టిమ్ డేవిడ్ విధ్వంసకర బ్యా టింగ్‌తో అదరగొడుతున్నారు. అటు బౌలింగ్‌లో భువనేశ్వర్ సారథ్యంలోని పేస్ ఎటాక్ దుమ్మురేపుతోంది.
RCB vs GT — Preview Facts
మ్యాచ్ తేదీ : ఏప్రిల్ 23, 2026
వేదిక : చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
టైమ్ : రాత్రి 7:30 PM
RCB స్థానం : 3వ స్థానం (4 గెలుపులు, 2 ఓటములు)
GT స్థానం : 6వ స్థానం (3 గెలుపులు, 3 ఓటములు)
పిచ్ : Batting friendly — 200+ స్కోర్ expected
Toss Factor : Chase చేసే జట్టుకు అనుకూలం
ముఖ్యంగా భువీ అద్భుతమైన బౌలింగ్‌తో తన పేస్‌లో పసతగ్గలే దని నిరూపిస్తున్నాడు. భువీతో పాటు హ్యాజి ల్ వుడ్, రసిక్ సలామ్ దార్ నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. స్పిన్ విభా గంలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. కృనాల్ అయితే ఆర్సీబీకి వికెట్లు తీసే స్పిన్నర్‌గా మారిపోయాడు.
గత సీజన్‌లోనూ భువీ, కృనాల్ ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మరో వైపు గుజరాత్ టైటాన్స్ కూడా గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పరాజయం పాలైంది. ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి మూడు ఓడిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ జట్టుకు బ్యాటింగే ప్రధాన బలం. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారూఖ్ ఖాన్ లాంటి హిట్టర్లు ఉన్నారు. ముఖ్యంగా గిల్, బట్లర్ సూపర్ ఫామ్ తో భారీస్కోర్లు అందిస్తున్నారు.
RCB, GT సహా అన్ని IPL జట్ల తాజా వార్తలు, మ్యాచ్ రిజల్ట్స్ కోసం మా స్పోర్ట్స్ విభాగం చదవండి.
ముంబై ఇండియన్స్ పై వీరిద్దరూ రాణించకపోడమే ఓటమికి కారణ మైంది. అటు వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తున్నాడు. బౌలింగ్ లో చూసుకుంటే కగిసో రబాజ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ అదరగొడుతున్నారు. రబాడ ఆరంభ మ్యాచ్ లలో నిరాశపరిచినా ఇప్పుడు గాడిలో పడ్డా డు. స్పిన్ విభాగంలో మాత్రం రషీద్ ఖాన్ ఇంకా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న చిన్న స్వామి స్టేడియం పిచ్‌పై పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.
తుది జట్లు అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, రసిక్ సలామ్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్
గుజరాత్ టైటాన్స్ : గిల్ (కెప్టెన్), సాయిసుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సిరాజ్, రబాడ, ప్రసిద్ధ కృష్ణ, అశోక్ శర్మ
Q1. RCB vs GT మ్యాచ్ ఎక్కడ చూడాలి?
Star Sports 1 & 2 లో live telecast, Jio Hotstar లో live streaming అందుబాటులో ఉంటుంది.
Q2. RCB డిఫెండింగ్ చాంపియన్ అంటే?
RCB 2025 సీజన్లో తొలిసారి IPL టైటిల్ గెలుచుకుంది. ఈ సీజన్లో ఆ టైటిల్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
Q3. చిన్నస్వామిలో RCB vs GT చరిత్ర ఏమిటి?
చిన్నస్వామిలో RCB record బలంగా ఉంది. Home ground అడ్వాంటేజ్ తో RCB ఇక్కడ ఎక్కువ మ్యాచ్లు గెలిచింది. GT మాత్రం గత రెండు సీజన్లలో బెంగళూరు వద్ద surprise results సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఈడెన్‌లో కేకేఆర్ vs లక్నో ఫైట్: తొలి గెలుపు కోసం కోల్‌కతా పోరాటం
ముగిసిన ఎల్‌ఎస్‌జీ ప్రీమియర్ లీగ్






