16 May, 2026 | 2:01 AM

19 ఏళ్ల IPL చరిత్రలో ఇది జరగలేదు — సంజూ నేడు చేసి చూపించాడు!

24-04-2026 01:39 AM

ముంబైకి చెన్నై షాక్

సీఎస్కే భారీ విజయం

4 వికెట్లతో హొస్సేన్ బెస్ట్ 

ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాల తర్వాత సన్‌రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పుడు ముంబై ఇండియవ్స్‌పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది.  బ్యాటింగ్‌లో సంజూ విధ్వంసకర శతకం, బౌలింగ్‌లో అకిల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్ తో ముంబై చిత్తుగా ఓడిపోయింది. 

ముంబై, ఏప్రిల్ 22: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్జింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ మెరుపు  ఆరంభాన్నిచ్చే క్రమంలో దూకుడుగానే ఆడారు. తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. రుతురాజ్ ఔటైన తర్వాత సంజూ ఒకవైపు జోరు కొనసాగిస్తున్నా మిగిలిన బ్యాటర్లు మాత్రం భారీ స్కోర్లు చేయలేకపోయారు. కానీ సంజూ మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌తో 40, బ్రెవిస్ తో 31, కార్తీక్ శర్మతో కలిసి 43 పరుగులు జోడించాడు.

సంజూ సెంచరీతో CSK కి జోష్ వచ్చింది — IPL 2026 పాయింట్ టేబుల్ తాజా స్థితి సహా అన్ని క్రీడా వార్తలకు విజయక్రాంతి న్యూస్ హోమ్‌పేజ్ సందర్శించండి.

ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో వరుసగా సిక్స ర్లు, బౌండరీలు కొట్టి శతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికి రెండో సెంచరీ.  ఓవరాల్ గా సంజూ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్పై సెంచరీ బాదిన తొలి సీఎస్కే బ్యాటర్‌గా నిలిచాడు.

19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై శతకం నమోదు చేయలేదు. ఈ సీజన్‌లో సంజూ శాంసన్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 8వ టీ20 సెంచరీ. దాంతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రికార్డును సంజూ సమం చేశాడు. ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కిం గ్స్ తరపున రెండు సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

2018లో షేన్ వాట్సన్ మాత్రమే సీఎస్కే తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు నమోదు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్ ఫర్ 2,  అశ్వని కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఛేజింగ్‌లో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన డానిశ్ మలేవర్ (0), నమన్ ధీర్ (0) డకౌటయ్యారు. డికాక్ (7) పరుగులకే వెనుదిరిగాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరినీ అఖిల్ హొస్సేన్ పెవిలియన్ కు పంపాడు.

IPL 2026 అన్ని మ్యాచ్‌ల స్కోర్‌కార్డ్‌లు, పాయింట్ టేబుల్ మరియు ప్లేయర్ స్టాట్స్ కోసం మా స్పోర్ట్స్ విభాగం చదవండి.

తిలక్ వర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులకు ఔటయ్యారు. ఇక్కడ నుంచి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్ళారు. ముంబై 104 పరుగులకు ఆలౌట్ అవడానికి ఒక్క కారణం మాత్రమే లేదు. అసలు సమస్య top order. డానిశ్ మలేవర్, నమన్ ధీర్ ఇద్దరూ డక్కౌట్ అయ్యారు — మొత్తం 11 పరుగులకు 3 వికెట్లు. ఆ దెబ్బ నుండి ముంబై ఎప్పుడూ కోలుకోలేదు. మధ్యలో SKY మరియు తిలక్ 73 పరుగులు జోడించినా, అకిల్ హొస్సేన్ వారిద్దరినీ సక్సెసివ్ గా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత tail ఇలా వచ్చి అలా వెళ్ళింది. 8 మంది బ్యాటర్లు single digit లోనే ఔట్ అయ్యారు.

CSK vs MI — మ్యాచ్ సారాంశం

CSK స్కోరు    : 207/6 (20 ఓవర్లు)

MI స్కోరు     : 104 ఆలౌట్ (18.1 ఓవర్లు)

ఫలితం         : CSK 103 పరుగుల విజయం

మ్యాన్ ఆఫ్ మ్యాచ్ : సంజూ శాంసన్ (101*)

CSK పాయింట్ టేబుల్ : 5వ స్థానం


స్కోరు బోర్డు 

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 207/6 (సంజూ శాంసన్ 101 నాటౌట్, రుతురాజ్ 22, బ్రెవిస్ 21,  ఘజ న్‌ఫర్ 2/25, అశ్వని కుమార్ 2/37 )

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 104 ( సూర్యకుమార్ 36, తిలక్ వర్మ 37, అకిల్ హొస్సేన్ 4/17, నూర్ అహ్మద్ 2/24 )


ఇవి కూడా చదవండి:

ఈడెన్‌లో కేకేఆర్ vs లక్నో ఫైట్: తొలి గెలుపు కోసం కోల్‌కతా పోరాటం

ముగిసిన ఎల్‌ఎస్‌జీ ప్రీమియర్ లీగ్

ఆర్‌సీబీ టాప్ లేపుతుందా?

ఆర్‌సీబీ ధనాధన్

ఆర్సీబీదే టైటిల్

ఆర్సీబీ నినాదాలతో హోరెత్తిన మాల్

కోహ్లీ వర్సెస్ గంభీర్

కోహ్లీ బాటలోనే రోహిత్ శర్మ

రిటర్మైంట్ వార్తల వేళ కోహ్లీ ఆసక్తికర ట్వీట్