13 May, 2026 | 12:07 AM

IPL 2026: సీఎస్కేలోకి ఆకాశ్ మధ్వాల్.. గాయంతో మాత్రే అవుట్

24-04-2026 01:31 AM

ఆయుశ్ మాత్రేకు రీప్లేస్‌మెంట్

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కీలక మార్పులు చేపట్టింది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన ఆయుశ్ మాత్రే స్థానంలో పేసర్ ఆకాశ్ మధ్వాల్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

ముంబై, ఏప్రిల్ 23: ఐపీఎల్ 19వ సీజన్‌లో కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమ వుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రీప్లేస్‌మెంట్స్ పై ఫోకస్ పెట్టింది. గాయం కారణంగా ఆయుశ్ మాత్రే సీజన్ మొత్తానికీ దూరమవడంతో అతని స్థానంలో పేస్ బౌలర్‌ను తీసు కుంది. సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో మాత్రే స్థానాన్ని భర్తీ చేసింది. సోషల్ మీడి యా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.

 Akash Madhwal — Key Stats

వయసు           : 32 సంవత్సరాలు

IPL మ్యాచ్‌లు    : 17

IPL వికెట్లు     : 23

గత జట్లు        : Mumbai Indians, Rajasthan Royals

CSK Contract    : రూ.30 లక్షల  (Base Price)

Speciality      : Death overs yorkers, 140+ kmph pace

రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో మధ్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. మధ్వాల్ కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. గతంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహిం చాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడం, యార్కర్లు వేయడం అతని ప్రత్యేకత. ఈ కారణంగానే మధ్వాల్‌ను సీఎస్కే ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్‌కు దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన అతనిదే. 

CSK squad తాజా అప్‌డేట్లు, IPL 2026 అన్ని జట్ల వార్తలు తెలుగులో చదవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.

ఎందుకు మధ్వాల్ ఎంపిక?

చెన్నై జట్టు డెత్ ఓవర్లలో బౌలింగ్ బలహీనతను దృష్టిలో పెట్టుకుని మధ్వాల్‌ను ఎంపిక చేసింది. యార్కర్లు, వేగంతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.


సీఎస్కేపై ప్రభావం

మధ్వాల్ రాకతో సీఎస్కే బౌలింగ్ దళానికి బలం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది.


Highlights

మాత్రే గాయం కారణంగా అవుట్

మధ్వాల్ రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్

సీఎస్కే బౌలింగ్ బలపడే అవకాశం


FAQ'S:

1. సీఎస్కేలోకి ఎవరు చేరారు?

ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి వచ్చాడు.

2. ఎవరి స్థానంలో వచ్చాడు?

ఆయుశ్ మాత్రే స్థానంలో.

3. మధ్వాల్ ప్రత్యేకత ఏమిటి?

డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం.